Education20th Oct 02:32 PMSunil Byrisetty1 min read
లాసెట్ వెబ్ ఆప్షన్స్ నమోదు రేపటి నుంచి
ఏపీలో లాసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఈ నెల 21 నుంచి నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇప్పటికే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించి, కొన్ని కళాశాలలకు బీసీఐ అనుమతులు లేనందున
ఏపీలో లాసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఈ నెల 21 నుంచి నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇప్పటికే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించి, కొన్ని కళాశాలలకు బీసీఐ అనుమతులు లేనందున ఈ ప్రక్రియను మధ్యలో నిలిపివేసింది. ఇప్పుడు అనుమతులు లభించినందున గతంలో వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకున్న వారు మార్పు చేసు కునేందుకు అవకాశం కల్పించింది. 21, 22 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు, 23న ఆప్షన్లు మార్పు, 25న సీట్ల కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 27 నుంచి 29 లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.