News27th Jun 10:26 AMSunil Byrisetty1 min read
కేరళ పర్యటనలో ఏపీ నేతలు
ఏపీ మంత్రి సత్యకుమార్ తదితరులు కేరళ పర్యటనకు వెళ్లారు. కేరళ రాష్ట్రం ఎర్నాకులం కడవంత్రలో ఉన్న గిరి నగర్ కమ్యూనిటీ హాలులో నేడు, రేపు జాతీయ సదస్సు ఏర్పాటు చేశారు. రాష్ట్రేతర తెలుగు స
ఏపీ మంత్రి సత్యకుమార్ తదితరులు కేరళ పర్యటనకు వెళ్లారు. కేరళ రాష్ట్రం ఎర్నాకులం కడవంత్రలో ఉన్న గిరి నగర్ కమ్యూనిటీ హాలులో నేడు, రేపు జాతీయ సదస్సు ఏర్పాటు చేశారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, ఆంధ్ర సాంస్కృతిక సంఘం - కొచ్చిన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన ఈ జాతీయ సదస్సుకు ముఖ్య అతిధిగా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, విశిష్ట అతిధిగా ఏపీ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చైర్మన్, అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ విశిష్ట అతిధిగా విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా వారు జాతీయ సదస్సులో ప్రసంగించనున్నారు. కేరళలోనూ తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్న విషయం తెలిసిందే.