News7th Oct 12:29 PMSunil Byrisetty1 min read

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఏపీ ముందుంది

రాష్ట్రంలో పెట్టుబడికి ఎంతోమంది ముందుకొస్తున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఏపీ ముందుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఏపీ ముందుంది
రాష్ట్రంలో పెట్టుబడికి ఎంతోమంది ముందుకొస్తున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఏపీ ముందుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం పారిశ్రామికంగా వేగంగా దూసుకెళ్తోందని పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్ల పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వినూత్న ప్రణాళికలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. తీరప్రాంతం వెంబడి ఓడరేవు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో మౌలిక సదుపాయాలు పెరుగుతాయని వివరించారు. మౌలిక సదుపాయాలతో పాటు ఉపాధి అవకాశాలు పెంచాలనేదే చంద్రబాబు లక్ష్యమన్నారు. ఓడరేవులను అనుసంధానిస్తూ రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక నగరాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
Scroll for the next article