News11th Aug 10:17 AMSunil Byrisetty1 min read
పన్నుల నిర్వహణ విధానంలో ఏపీ టాప్
రాష్ట్రంలో పన్నుల నిర్వహణలో కృత్రిమ మేథస్సు, డేటా ఆధారిత విశ్లేషణలను వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. ఏపీ ప్రభుత్వం ఏఐని ఉపయోగించుకుంటున్న తీరును
రాష్ట్రంలో పన్నుల నిర్వహణలో కృత్రిమ మేథస్సు, డేటా ఆధారిత విశ్లేషణలను వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. ఏపీ ప్రభుత్వం ఏఐని ఉపయోగించుకుంటున్న తీరును అధ్యయనం చేయడానికి జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు రాష్ట్రానికి వచ్చారు. రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయాన్ని సందర్శించిన వారు పన్నుల నిర్వహణలో ఏఐ అమలు తీరును అధ్యయనం చేశారు. పన్నుల నిర్వణలో ఏఐ వినియోగిస్తున్న తీరుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జీఎస్టీ కౌన్సిల్ అధికారులకు వివరించారు. రిజిస్ట్రేషన్లు, రిటర్నులు, ఆదాయపన్ను, వృత్తిపన్ను, పన్నుల బకాయిలు, ఆడిట్లు, తనిఖీలు, పరిశీలన వంటి విభాగాల్లో ఐఏ ఆధారిత డ్యాష్ బోర్డులను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ సందర్భంగా ప్రదర్శించారు. ప్రధానంగా రాబడికి సంబంధించి డ్యాష్ బోర్డు, ఈ-వే బిల్ డ్యాష్ బోర్డులు జీఎస్టీ కౌన్సిల్ అధికారులను ఆకట్టుకున్నాయి.