Politics23rd Sep 01:00 PMSunil Byrisetty1 min read

శాసనమండలిలో నాగబాబు ఫుల్ ఫైర్

ఏపీ శాసనమండలిలో కేసులపై చర్చ జరిగింది. రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తొలిసారి మాట్లాడిన నాగబాబ

శాసనమండలిలో నాగబాబు ఫుల్ ఫైర్
ఏపీ శాసనమండలిలో కేసులపై చర్చ జరిగింది. రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తొలిసారి మాట్లాడిన నాగబాబు కొందరు వ్యక్తులు తప్పులు చేయకపోయినా కేసులు పెట్టించుకుని జైళ్లో ఉండాల్సి వస్తుందని తెలిపారు. వాళ్లు జైల్లో ఉన్న సమయాన్ని ఎలా తిరిగి ఇవ్వగలమని ప్రశ్నించారు. రాజకీయ కక్షలతో పెట్టిన కేసుల వల్ల సామాన్యుల జీవితాలు తారుమారవుతున్నాయన్నారు. రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసుల విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ నాగబాబు కోరారు.
Andhra Pradesh
AP Legislative Council
Nagababu
Janasena Party
Pending Cases
Political Cases
Judiciary
Law and Order
శాసన చర్చ
కోర్ట్ కేసులు
రాజకీయ బాధ్యత
Scroll for the next article