Politics3rd Aug 12:58 PMSunil Byrisetty1 min read
మున్సిపలే ముందా?
ఏపీలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే పంచాయతీల లెక్కలు తేలాల్సి ఉండటంతో ముందుగా పురపాలక సంఘాలు , నగర పాలక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత
ఏపీలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే పంచాయతీల లెక్కలు తేలాల్సి ఉండటంతో ముందుగా పురపాలక సంఘాలు , నగర పాలక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15కు పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు నిలిచిపోవడానికి లేదా పెండింగ్‌లో ఉండటానికి ఈ విలీన వివాదాలు, తదనంతర కోర్టు కేసులే ప్రధాన కారణంగా ఉంది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై వేగంగా విచారణ పూర్తయ్యేలా అడ్వకేట్ జనరల్ ద్వారా కౌంటర్లు దాఖలు చేయడం ఒక మార్గమైతే.. వివాదాస్పద గ్రామాలను విలీనం నుంచి మినహాయించి , కేవలం మున్సిపాలిటీ పరిధి వరకు మళ్లీ సరిహద్దుల నోటిఫికేషన్ ఇవ్వడం మరో ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నారు. దీనికోసం చట్ట సవరణ ఆర్డినెన్స్ లేదా అసెంబ్లీలో బిల్లును తెచ్చేందుకు పురపాలక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్ర నిధుల విడుదల అత్యంత కీలకమైనందున, న్యాయపరమైన అడ్డంకులు ఎన్ని ఉన్నప్పటికీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే ప్రణాళికతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.