Crime26th Apr 12:57 PMSunil Byrisetty1 min read

విజయసాయిరెడ్డి క్లూతో లిక్కర్ స్కాం అరెస్టులు?

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన క్లూతో లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. విజయసాయిని సీఐడీ అధికారులు లిక్కర్ స్కాంలో సాక్షిగా పిలిచారు. కానీ ఆయనను ఎఫ్ఐఆర్‌ల

విజయసాయిరెడ్డి క్లూతో లిక్కర్ స్కాం అరెస్టులు?
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన క్లూతో లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. విజయసాయిని సీఐడీ అధికారులు లిక్కర్ స్కాంలో సాక్షిగా పిలిచారు. కానీ ఆయనను ఎఫ్ఐఆర్‌లో నిందితుడిగా చేర్చారు. ఈ నేపథ్యంలో ఆయనను అప్రూవల్‌గా మారుస్తానంటే సాక్ష్యాలన్నీ చెప్పేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. విజయసాయి ఇచ్చిన సమాచారంతో తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి సమీప బంధువు.. ఎస్పీవై ఇండస్ట్రీస్ తరపున లిక్కర్లు తయారు చేసి అమ్మిన సజ్జల శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే కసిరెడ్డి రాజ్‌తో పాటు ఏ8 చాణక్యను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు త్వరలో మిగిలిన వారిని కూడా అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.
Andhra Pradesh
Liquor Scam Cases
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
కసిరెడ్డి రాజ్‌
ఏ8 చాణక్య
సజ్జల శ్రీధర్ రెడ్డి
Scroll for the next article