Politics20th Jul 12:50 PMSunil Byrisetty1 min read

మద్యం కుంభకోణంలో ఏపీకి నిందితులు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపిన మద్యం కుంభకోణం దర్యాప్తులో కీలక అడుగు పడింది. ఏపీ ఏసీబీ అధికారులు నిందితులను ఏపీకి తరలించారు. కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఈడీ కేసులో అరెస్టై,

మద్యం కుంభకోణంలో ఏపీకి నిందితులు
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపిన మద్యం కుంభకోణం దర్యాప్తులో కీలక అడుగు పడింది. ఏపీ ఏసీబీ అధికారులు నిందితులను ఏపీకి తరలించారు. కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఈడీ కేసులో అరెస్టై, జైలులో రిమాండ్‌లో ముగ్గురు కీలక నిందితులు ఉన్నారు. కాగా.. ఏసీబీ అధికారులు పీటీ వారెంట్‌పై వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కస్టడీలోకి వెళ్లిన వారిలో మద్యం సరఫరా విభాగంతో పాటు పాలసీ రూపకల్పన ప్రక్రియలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాసుదేవ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరియు కారుమూరి సునీల్ ఉన్నారు. జైలులో ఉన్న వీరిని ఏసీబీ ప్రత్యేక బృందాలు న్యాయస్థానం అనుమతితో విజయవాడలోని ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచేందుకు విజయవాడకు తరలించారు.
Andhra Pradesh
AP Liquor Scam
ACB
Vasudeva Reddy
Kasireddy Rajasekhar Reddy
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి
కారుమూరి సునీల్
ఈడీ
విజయవాడ
Scroll for the next article