Politics14th Oct 04:02 PMSunil Byrisetty1 min read

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ 'అనిల్ చంద్ర పునేఠా' మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. 77 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు నోటిఫికేషన్ ఇచ్చా

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ 'అనిల్ చంద్ర పునేఠా' మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. 77 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. 100 అర్బన్ బాడీస్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 28న ఎన్నికలు నిర్వహించి.. 30న ఫలితాలు విడుదల చేయనున్నారు. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు నుంచే 'ఎన్నికల కోడ్' అమలులోకి వచ్చింది. ఈ నెల 18న నామినేషన్లు దాఖలు.. ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 21న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ప్రకటించారు.
Scroll for the next article