News24th Aug 03:02 PMSunil Byrisetty1 min read

ఆ షెడ్యూల్ తప్పు.. ఎన్నికల సంఘం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల తేదీలు, షెడ్యూల్ అంటూ వాట్సాప్‌లో తప్పుడు సమాచారం ప్రచారం అవుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. కొందరు వ్యక్తు

ఆ షెడ్యూల్ తప్పు.. ఎన్నికల సంఘం క్లారిటీ
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల తేదీలు, షెడ్యూల్ అంటూ వాట్సాప్‌లో తప్పుడు సమాచారం ప్రచారం అవుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. కొందరు వ్యక్తులు ప్రభుత్వ శాఖ/సంస్థ పేరుతో, అధికారిక గుర్తులు ఉపయోగించి ఈ సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ఆ సమాచారానికి ఎలాంటి అధికారిక అనుమతి లేదని, అది నకిలీ, నిర్ధారణ లేని సమాచారం అని స్పష్టం చేసింది. ప్రజలు అలాంటి సమాచారాన్ని నమ్మవద్దని, ఫార్వర్డ్ చేయవద్దని, షేర్ చేయవద్దని ఎన్నికల సంఘం సూచించింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని తయారు చేసి ప్రచారం చేసే వారిపై వర్తించే సైబర్ చట్టాలు/నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికలకు సంబంధించిన నిజమైన అధికారిక సమాచారం AP State Election Commission నుంచి అధికారిక Press Note లేదా Press Conference ద్వారానే వెల్లడిస్తామని తెలిపింది.
Andhra Pradesh
AP Elections
State Election Commission
Local Body Elections
Panchayat Elections
Municipal Elections
Election Schedule
Fake News
తప్పుడు సమాచారం
ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్
సైబర్ క్రైమ్
ఎన్నికల తేదీలు
Scroll for the next article