News4th Nov 05:57 PMSunil Byrisetty1 min read

ఏపీ మెడ్‌టెక్‌ ఆవిష్కరణలకు అంతర్జాతీయ గుర్తింపు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన మెడ్‌టెక్‌ ఆవిష్కరణల విజయాలను అంతర్జాతీయ వేదికపై వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందింది. నవంబర్‌ 18న లండన్‌లో నిర్వహించనున్న హెల్త్‌ఏఐ

ఏపీ మెడ్‌టెక్‌ ఆవిష్కరణలకు అంతర్జాతీయ గుర్తింపు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన మెడ్‌టెక్‌ ఆవిష్కరణల విజయాలను అంతర్జాతీయ వేదికపై వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందింది. నవంబర్‌ 18న లండన్‌లో నిర్వహించనున్న హెల్త్‌ఏఐ గ్లోబల్‌ గవర్నెన్స్‌ ఫోరమ్‌లో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొననుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ కృషితో రాష్ట్రంలో ఆధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజారోగ్య సేవలకు అనుసంధానించే దిశగా చేపట్టిన వినూత్న కార్యక్రమానికి ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఏపీ మెడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ ద్వారా 18 కృత్రిమ మేధ ఆధారిత వైద్య సాంకేతిక పరిష్కారాలను 14 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి, 12 వేల మందికి పైగా రోగులకు సేవలు అందించడం రాష్ట్ర ప్రగతికి నిదర్శనంగా నిలిచింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్‌టీఐహెచ్‌), ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ (ఏపీఐఎస్‌) సహకారంతో ఏపీ మెడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ 2025–26 కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా వైద్య సాంకేతిక రంగంలో వినూత్న పరిష్కారాలను గుర్తించి, ప్రభుత్వ వైద్య వ్యవస్థలో పరీక్షించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమానికి 297 దరఖాస్తులు అందగా, నిపుణుల మూల్యాంకనం అనంతరం 18 వైద్య సాంకేతిక ఆవిష్కరణలను ఎంపిక చేశారు. వీటిని 14 జిల్లాల్లో 37 రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసి, 12 వేల మందికి పైగా రోగులకు సేవలు అందించారు.
Scroll for the next article