Education12th Aug 09:00 AMSunil Byrisetty1 min read
ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల..
ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. https://apdsc.apcfss.i
ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. https://apdsc.apcfss.in/ వెబ్ సైట్లో అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్లోకి వెళ్లి స్కోరు కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తొలుత క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లాలి. అక్కడ తమ హాల్ టికెట్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే.. 'సర్వీసెస్' అని వస్తుంది. అక్కడ ఏపీ డీఎస్సీ ఫలితాలను సెలక్ట్ చేసుకుంటే స్కోరు కార్డు అందుబాటులోకి వస్తుంది. అందులో అభ్యర్థులు రాసిన మొత్తం పేపర్లు, సాధించిన మార్కులు, టెట్ మార్కులను పేర్కొంటూ క్వాలిఫైడ్/నాన్ క్వాలిఫైడ్ అనే వివరాలు ఉంటాయి. టెట్ వివరాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా తమకు తామే టెట్ వివరాలు సరిచేసుకోవడానికి అవకాశం ఇచ్చాం. ఈ అవకాశం రెండు రోజులు (ఆగస్టు 13వరకు) మాత్రమే అందుబాటులో ఉంటుంది” అని కృష్ణారెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.