Notifications1st May 12:28 PMSunil Byrisetty1 min read

మెగా డీఎస్సీలో క్రీడా కోటా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాప్రాధికార సంస్థ మెగా డీఎస్సీ-2025 లో భాగంగా 3శాతం క్రీడా కోటా నోటిఫికేషన్ ను విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మండి

మెగా డీఎస్సీలో క్రీడా కోటా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాప్రాధికార సంస్థ మెగా డీఎస్సీ-2025 లో భాగంగా 3శాతం క్రీడా కోటా నోటిఫికేషన్ ను విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారుల ప్రతిభకు న్యాయమైన గుర్తింపు ఇవ్వడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ముఖ్యమైనదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన క్రీడాకారులకు 3% హారిజాంటల్ రిజర్వేషన్ కల్పిస్తూ, ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు. మెగా డీఎస్సీలో విడుదల చేసిన 16,347 పోస్టుల్లో క్రీడా కోటా క్రింద 421 పోస్టులను స్పోర్ట్స్ కోటా క్రింద కేటాయించినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో క్రీడాకారులను కనీసం పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు. మెగా డీఎస్సీకి అర్హులైన క్రీడాకారులు మే 2 నుంచి మే 31 వరకు https://sports.ap.gov.in, https://sportsdsc.apcfss.in వెబ్‌సైట్లలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. క్రీడా కోటా క్రింద ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లో 333, మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలల్లో 30, ఏపీ ట్రైబల్ వెల్ ఫేర్ ఆశ్రమ్ పాఠశాలల్లో 22, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2, ఏపీ మోడల్ పాఠశాలల్లో 4, ఏపీ సోషల్ వేల్పేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 7, ఏపీ గురుకుల వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 23 పోస్టులు కేటాయించినట్లు వివరించారు.
AP
mega dsc
sports quota notification
క్రీడాప్రాధికార సంస్థ మెగా డీఎస్సీ-2025
3శాతం క్రీడా కోటా నోటిఫికేషన్
మంత్రి రాంప్రసాద్ రెడ్డి
Scroll for the next article