Education22nd Aug 09:07 AMSunil Byrisetty1 min read

నేడు డీఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదల

మెగా DSC-2025 మెరిట్ లిస్ట్ నేడు విడుదల చేయనున్నారు. అభ్యర్థుల స్కోర్ కార్డులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించు

నేడు డీఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదల
మెగా DSC-2025 మెరిట్ లిస్ట్ నేడు విడుదల చేయనున్నారు. అభ్యర్థుల స్కోర్ కార్డులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించుకోవడానికి ఆఖరి అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. మెరిట్ లిస్ట్ జాబితా డీఎస్సీ అధికారిక వెబ్సైటుతో పాటు జిల్లా విద్యాధికారి వెబ్సైటులో కూడా అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందాలి. వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా ‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’ లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించబడుతుంది. సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు జెరాక్స్ కాపీలు, 5 పాస్ పోర్టు సైజు ఫోటోలతో సర్టిఫికెట్లు వెరిఫికేషనుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అభ్యర్థి హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైనా మెరిట్ లిస్టులో తరువాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు నమ్మవద్దు. అభ్యర్థులు డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న ఫలితాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.
AP Education Department
DSC Merit List
Mega DSC Results
AP Teacher Recruitment
DSC Score Card
DSC Certificate Verification
Sports Quota Merit List
డీఎస్సీ మెరిట్ లిస్ట్
సర్టిఫికెట్ల వెరిఫికేషన్
Scroll for the next article