News8th Jun 07:08 PMSunil Byrisetty1 min read
మెప్మాకు స్కాచ్ అవార్డుల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ పట్టణపేదరిక నిర్మూలన సంస్ధ మెప్మా ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డులకు ఎంపికైంది. వివిధ కేటగిరీల్లో నామినేట్ అయిన 14 ప్రాజెక్ట్‌లకుగాను 9 ప్రాజెక్ట్‌లు ప్లాటినం అవార
ఆంధ్రప్రదేశ్ పట్టణపేదరిక నిర్మూలన సంస్ధ మెప్మా ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డులకు ఎంపికైంది. వివిధ కేటగిరీల్లో నామినేట్ అయిన 14 ప్రాజెక్ట్‌లకుగాను 9 ప్రాజెక్ట్‌లు ప్లాటినం అవార్డులు దక్కించుకున్నాయి. పట్టణ ప్రాంతాల మహిళలకు సాధికారత కల్పించడంలో మెప్మా కీలక పాత్ర పోషిస్తోంది. వివిధ పథకాల ద్వారా మహిళలకు జీవనోపాధి కల్పిస్తూ ఆర్ధికాభివృద్దికి చర్యలు తీసుకుంటోంది. నివాసం, బ్యాంక్ లింకేజి పథకాలు, లైవ్ లీ హుడ్ ట్రాకర్, ఈ - కామర్స్ అమ్మకాలు, స్కిల్ డెవలప్ మెంట్, జీవనోపాధి యూనిట్లు, ప్రేరణ సఖి, వీధి వ్యాపారుల మేనేజ్ మెంట్ ప్రోగ్రాం, దుర్బర జీవితాన్ని గడిపేవారిని ఆర్ధికంగా పైకి తీసుకువచ్చే పథకాలకు అవార్డుల పంట పండింది. సెప్టెంబర్ 20న న్యూఢిల్లీలో జరిగే సమ్మిట్లో SKOCH ప్లాటినం అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్ అవార్డులు అందుకోనున్నారు.