News28th Jan 01:29 PMSunil Byrisetty1 min read

"వింగ్స్ ఇండియా - 2026"లో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టులో "వింగ్స్ ఇండియా - 2026" ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్ట

"వింగ్స్ ఇండియా - 2026"లో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టులో "వింగ్స్ ఇండియా - 2026" ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు & మౌలిక సదుపాయాల శాఖ తరపున ఏపీ ఎడిసిఎల్ ప్రాంగణంలో పలు స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టాల్ ను ప్రారంభించి.. అనంతరం స్టాల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా జిఎంఆర్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్ ను సందర్శించారు. అనంతరం ఏవియేషన్ రంగంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అపార అవకాశాలను మంత్రి వివరించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ రంగంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతుందని మంత్రి ఆకాంక్షించారు.
AP Investments
Wings India 2026
BC Janardhan Reddy
Ram Mohan Naidu
Andhra Pradesh Aviation
Aviation Sector
Begumpet Airport
మౌలిక సదుపాయాలు
ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్
జీఎంఆర్ ఇన్ఫ్రా
Scroll for the next article