News15th Aug 02:08 PMSunil Byrisetty1 min read
మంత్రి చొరవతో విద్యార్ధులకు ఆర్టీసీ సదుపాయం
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల మండలం బందర్లపల్లి గ్రామానికి నేడు ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. బందర్లపల్లికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలంటూ గతంలో
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల మండలం బందర్లపల్లి గ్రామానికి నేడు ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. బందర్లపల్లికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలంటూ గతంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డికి దృష్టికి తీసుకొచ్చారు. బందర్లపల్లి విద్యార్ధులు, గ్రామస్తులు అభ్యర్థన మేరకు తక్షణమే స్పందించి, ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఆ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కోరారు.
మంత్రి చొరవతో నేడు సమీపంలోని తాడిపత్రి బస్ డిపో నుంచి ఉదయం 8.30 గంటలకు & సాయంత్రం 4.15 గంటలకు అంకిరెడ్డిపల్లె నుంచి బందర్లపల్లెకు బస్సు సౌకర్యం ఏపీఎస్ఆర్టీసీ కల్పించింది. దీంతో పాఠశాల, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు, గ్రామస్తులకు రవాణా కష్టాలు తీరాయంటూ స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.