Politics9th Apr 05:04 PMSunil Byrisetty1 min read

ఏపీ భవన్లో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ

ఢిల్లీలోని ఏపీ భవన్లో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బియ్యం నాణ్యత ఎలా ఉందో మంత్రి నాదెండ్ల మనోహర్, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ ,ఏపీ భవన్

ఏపీ భవన్లో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ
ఢిల్లీలోని ఏపీ భవన్లో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బియ్యం నాణ్యత ఎలా ఉందో మంత్రి నాదెండ్ల మనోహర్, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ ,ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ పరిశీలించారు. ఈ సమయంలో బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో మంత్రి నాదెండ్ల మనోహర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర సరఫరాల శాఖ పేరుతో ఇక్కడ బియ్యం షాపు నడిపిస్తున్నారని సీరియస్ అయ్యారు. వెంటనే షాపును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అమ్మే బియ్యంలో నాణ్యత లేదని, 26 కేజీల బియ్యం బస్తా 25 కేజీలు మాత్రమే ఉందని అన్నారు. బియ్యంలో నూకల శాతం ఎక్కువగా ఉందని గమనించిన మంత్రి, నెలలోగా ఏపీ పౌర సరఫరాల శాఖ తరపున రేషన్ స్టోర్ ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Andhra Pradesh Civil Supplies Minister
Sudden Inspection
Delhi AP Bhavan
Rice Quality Check
రేషన్ స్టోర్
బియ్యం నాణ్యత
Scroll for the next article