News18th Aug 04:05 PMSunil Byrisetty1 min read

కేంద్ర మంత్రులతో మంత్రి లోకేష్ భేటీలు

విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు – మచిలీపట్నం నడుమ 6లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని కేంద్ర ఉపరితల రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ

కేంద్ర మంత్రులతో మంత్రి లోకేష్ భేటీలు
విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు – మచిలీపట్నం నడుమ 6లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని కేంద్ర ఉపరితల రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ న్యూఢిల్లీలో కేంద్రమంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. కేంద్ర మంత్రులు జైశంకర్, నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరీని కలిసిన అనంతరం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదారంగా అర్థిక సాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల పురోగతిని వివరించిన లోకేష్.. ఎపిలో కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
AP politics
Nara Lokesh
Union Ministers meetings
Vijayawada traffic
Kanuru-Machilipatnam road expansion
Nitin Gadkari
S. Jaishankar
మచిలీపట్నం మధ్య 6లైన్ల రోడ్డు
నిర్మలా సీతారామన్
Scroll for the next article