News5th Sep 11:14 AMSunil Byrisetty1 min read
ప్రధాని మోదీని కలవనున్న మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్ ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూ ఢిల్లీలో కలవనున్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమను రాష్ట్రానికి కేటాయించినంద
ఆంధ్రప్రదేశ్ ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూ ఢిల్లీలో కలవనున్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమను రాష్ట్రానికి కేటాయించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలపనున్నారు. అలాగే విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టినందుకు, జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా రాష్ట్రానికి వచ్చిన లాభాల విషయాన్ని వివరించనున్నారు.
జీఎస్టీ వసూళ్లు పెరిగిన విధానాన్ని కూడా ప్రధానికి తెలియజేయనున్నారు.
విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా డే కార్యక్రమంపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా నివేదిక ఇవ్వాలని కోరగా, ఆ వివరాలను సమర్పించే అవకాశం ఉంది.
అదే సమయంలో, పెండింగ్‌లో కొనసాగుతున్న ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆమోదం ఇవ్వాలని లోకేష్ ప్రధాని మోదీని అభ్యర్థించనున్నట్లు సమాచారం.ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ, పరిపాలనా పరిణామాలను కూడా లోకేష్ ప్రధానితో చర్చించనున్నట్లు తెలిసింది.