News11th Jun 11:58 AMSunil Byrisetty1 min read

యూపీ సీఎం యోగితో ఏపీ మంత్రి నారాయణ భేటీ

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. లక్నోలోని కాళిదాస్ మార్గ్‌లో ఉన్న యూపీ సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. ఘన వ్యర్థాల

యూపీ సీఎం యోగితో ఏపీ మంత్రి నారాయణ భేటీ
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. లక్నోలోని కాళిదాస్ మార్గ్‌లో ఉన్న యూపీ సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. ఘన వ్యర్థాల ప్లాంట్ల అధ్యయనం కోసం లక్నో పర్యటనకు వెళ్లిన మంత్రి నారాయణ బృందం క్షేత్రస్థాయి పర్యటన చేసింది. తర్వాత యూపీ సీఎం,అధికారులతో మంత్రి నారాయణ, ఏపీ అధికారులు భేటీ అయ్యారు. ఉత్తర ప్రదేశ్‌లో ఘన వ్యర్థాల నిర్వహణను అక్కడి అధికారులు వివరించారు. ఏపీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కొరకు ఉపయోగిస్తున్న పద్ధతులను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మంత్రి నారాయణ, అధికారులు వివరించారు. ఏపీలో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించేందుకు రావాలని యూపీ అధికారులను మంత్రి నారాయణ ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడని ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు.
Andhra Pradesh news
AP Minister Narayana
Up cm Yogi
యూపీ సీఎం యోగితో ఏపీ మంత్రి నారాయణ భేటీ
ఏపీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పద్ధతులను సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మంత్రి నారాయణ
Scroll for the next article