Politics6th Mar 11:14 AMSunil Byrisetty1 min read
ఆ భూములమ్మి రాజధాని కడతాం!
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న భూములలో కొంతమేర అమ్మడం ద్వారా రాజధాని నిర్మిస్తామన్నారు మంత్రి నారాయణ. అంతే గానీ ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం వేసేది లేదని స్పష్టం చేశార
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న భూములలో కొంతమేర అమ్మడం ద్వారా రాజధాని నిర్మిస్తామన్నారు మంత్రి నారాయణ.
అంతే గానీ ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం వేసేది లేదని స్పష్టం చేశారు.
అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారాయణ నెల్లూరులో మీడియా తో మాట్లాడారు
రాజధాని నిర్మాణానికి హడ్కో,ప్రపంచ బ్యాంకు, AIIBతో పాటు జర్మనీ బ్యాంకు నుంచి రుణాలు సేకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
రాజధానిపై ప్రతిపక్షాల మాటలు వినవద్దు, నమ్మవద్దని ప్రజలకు సూచించారు. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సడ్ గా ఉండాలని సీఎం చెప్పారన్న మంత్రిపక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నమన్నారు. బడ్జెట్ లో అమరావతికి 6 వేల కోట్లు కేటాయించారని...అవసరమైతే ఇంకా నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్లు మంత్రి అన్నారు.
రాజధాని విషయంలో అంతా పారదర్శకంగా ఉంటామని, ఎలాంటి అవకతవకలు ఉండవని మరోసారి స్పష్టం చేశారు.
SSR రేట్ల ప్రకారం మాత్రమే టెండర్లు పిలిచి నిర్మాణాలు చేస్తున్నామని, గత ప్రభుత్వం మాదిరిగా నిధులు పక్క దారి పట్టించడం లేదని అన్నారు. 217 చ.కి.మీ పరిధిలో పరిధిలో అంతర్జాతీయ ప్రమాణాలతో 5 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు.
ఇప్పటికే 50 వేల కోట్ల పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని. చెప్పుకొచ్చారు.1000 నుంచి 1200 ఎకరాల్లో అంతర్జాతీయ యూనివర్సిటీలు, పాఠశాలలు,పలు సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.