Politics14th Jun 02:56 PMSunil Byrisetty1 min read

వైయస్ జగన్‌కు మహిళా మంత్రి సవాల్!

వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత జగన్

వైయస్ జగన్‌కు మహిళా మంత్రి సవాల్!
వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత జగన్‌కు సవాల్ విసిరారు. వైసీపీ ఆరోపిస్తున్నట్లు ‘తల్లికి వందనం’ నిధులు లోకేష్ జేబులోకి వెళ్లినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు, విద్య విలువ తెలిసిన నాయకుడు నారా లోకేష్ అయితే.. విద్యకు ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వం అన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో 67 లక్షల 27 వేల 164 మందికి తల్లికి వందనం అందజేశామని చెప్పారు. దాదాపు 8,745 కోట్లు తల్లికి వందనం కింద డైరెక్టుగా తల్లుల అకౌంట్లలోకి నిధులు జమ అయ్యాయని వివరించారు.
Andhra Pradesh news
Ap politics
Minister Savitha
Thalliki Vandanam
YSRCP
Minister Savitha Counters
వైఎస్సార్‌సీపీకి ఏపీ మంత్రి సవిత ఓపెన్ ఛాలెంజ్
జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా
Scroll for the next article