News15th May 12:29 PMSunil Byrisetty1 min read
దసరాలోగా చేనేత సహకార ఎన్నికలు
దసరాలోగా చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్లూఎస్ సంక్షేమ చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేనేతలకు త్వరలో హెల్త్ ఇన్స్యూరెన్స్ అమలు చేయనున్నామన్నార
దసరాలోగా చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్లూఎస్ సంక్షేమ చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.
చేనేతలకు త్వరలో హెల్త్ ఇన్స్యూరెన్స్ అమలు చేయనున్నామన్నారు.
చేనేతల సంక్షేమానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, చేనేత దుస్తుల అమ్మకాలు పెంచేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్ లో రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చిన నేతన్నలతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి మంత్రి సవిత సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆమె చేనేత రంగ అభివృద్ధికి సూచనలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేస్తున్నామన్నారు.
50 ఏళ్లు నిండిన నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం 92,724 మందికి రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నామన్నారు.