News10th Jan 04:16 PMSunil Byrisetty1 min read
గుంటూరు, కాకినాడలో క్రీడాకేంద్రాల మంజూరుకు వినతి
కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో క్రీడల అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియాన
కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో క్రీడల అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియాని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిస్థాయి, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఫుట్‌బాల్ మైదానం లేకపోవడంపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో, అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఫుట్‌బాల్ మైదానం, ఫ్లడ్ లైట్స్, గ్యాలరీతో కూడిన అత్యాధునిక ఫుట్‌బాల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర సహకారం అందించాలని మంత్రి కోరారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్‌లిఫ్టింగ్ విభాగాలకు జాతీయ ఉత్తమత్వ కేంద్రం (NCoE) మంజూరు చేయాలని.
కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పరిధిలో హాకీ, షూటింగ్ విభాగాలకు జాతీయ ఉత్తమ కేంద్రం (NCoE) ఏర్పాటు చేయాలని కోరారు. ఖేలో ఇండియా పథకం కింద ఇప్పటికే రాష్ట్రంలో విజయవంతంగా పనిచేస్తున్న 26 కేంద్రాలతో పాటు, ప్రతి జిల్లాకు ఒక అదనపు జిల్లా స్థాయి ఖేలో ఇండియా కేంద్రం (DLKIC) మంజూరు చేయాలని. ఖేలో ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా, రూ. 675.36 కోట్ల అంచనా వ్యయంతో 56 క్రీడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మంజూరు చేయాలని కోరారు.