News7th Aug 09:07 AMSunil Byrisetty1 min read
కూటమి ప్రభుత్వం ఉండగా.. చేనేతలకు పండుగ
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత అనేది భారతదేశ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థాన
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత అనేది భారతదేశ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. గ్రామీణ జీవిత శైలిని ప్రతిబింబించే ఈ రంగం దేశ ఆర్థిక, సాంస్కృతిక పురోగతిలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. చేనేత ఉత్పత్తులలో ఉన్న నైపుణ్యం, విలక్షణతకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని ప్రోత్సహించే దిశగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. వ్యవసాయం తర్వాత వేలాది మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోందన్నారు. అలాంటి రంగానికి అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం నేటి నుంచి ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతోందని వివరించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారాన్ని భరించనుందన్నారు. దీంతో పాటు త్రిఫ్ట్ ఫండ్ కింద ఏడాదికి రూ.5 కోట్లు విడుదల చేయనుందని వెల్లడించారు. చేనేత కళను ప్రోత్సహిస్తూ, ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విధానాలు రూపొందిస్తున్నదని తెలిపారు.