News2nd Aug 12:26 PMSunil Byrisetty1 min read

కొత్త బార్ పాలసీపై మంత్రుల బృందం కీలక భేటీ

ప్రస్తుత బార్ పాలసీ గడువు ఆగస్టు 31తో ముగియనున్న నేపథ్యంలో, నూతన ఎక్సైజ్ విధానంపై మంత్రుల బృందం సమావేశం నిర్వహించింది. మంగళగిరి ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం నుంచి హైబ్రిడ్ మోడ్‌లో జరి

కొత్త బార్ పాలసీపై మంత్రుల బృందం కీలక భేటీ
ప్రస్తుత బార్ పాలసీ గడువు ఆగస్టు 31తో ముగియనున్న నేపథ్యంలో, నూతన ఎక్సైజ్ విధానంపై మంత్రుల బృందం సమావేశం నిర్వహించింది. మంగళగిరి ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం నుంచి హైబ్రిడ్ మోడ్‌లో జరిగిన ఈ సమావేశంలో రాబోయే కొత్త బార్ పాలసీ రూపకల్పనపై లోతైన చర్చ జరిగింది. సమావేశానికి ఎక్సైజ్, ఖనిజ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఇంధన శాఖ మంత్రి గోట్టి‌పాటి రవికుమార్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఎక్సైజ్ డైరెక్టర్ నిషాంత్ కుమార్ ప్రస్తుతం అమలులో ఉన్న 2022–25 బార్ పాలసీపై సమగ్రంగా వివరించారు. ప్రస్తుత పాలసీ క్రింద రాష్ట్రంలో 840 స్టాండలోన్ బార్లు, 50 స్టార్ హోటల్స్, మైక్రోబ్రూరీస్ లాంటి సంస్థలకు లైసెన్సులు మంజూరయ్యాయని చెప్పారు. అలాగే 44 బార్ లైసెన్సులు గడువు ముగిసిన తర్వాత రిన్యువల్ కాలేదని తెలియజేశారు. పక్కటి రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళల బార్ విధానాలపై పోలికలు కూడా చర్చకు వచ్చాయి.
Andhra Pradesh Government
Bar Policy
New Excise Policy
Excise Department
Kollu Ravindra
Gottipati Ravikumar
Comm
issioner
Nishant KumarBar License Renewal
మైక్రోబ్రూరీస్
హైబ్రిడ్ సమావేశం
Scroll for the next article