News21st Jul 10:34 AMSunil Byrisetty1 min read

ఆక్వా ఫీడ్ ధరలపై ఢిల్లీకి ఏపీ మంత్రులు

ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలని కేంద్ర మంత్రులను కోరేందుకు ఏపీ మంత్రులు డిఎస్ బీవీ స్వామి, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర పశు సంవర్ధక శా

ఆక్వా ఫీడ్ ధరలపై ఢిల్లీకి ఏపీ మంత్రులు
ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలని కేంద్ర మంత్రులను కోరేందుకు ఏపీ మంత్రులు డిఎస్ బీవీ స్వామి, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర పశు సంవర్ధక శాఖ, మత్య్స శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తో సమావేశమయ్యారు. ఆక్వా రంగానికి ఊరట కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సోయాబీన్ మీల్ దిగుమతులకు అనుమతి కల్పించాలని మంత్రులు కోరారు. ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలని డిఎస్ బీవీ స్వామి, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్ మంత్రులు కోరారు. అలాగే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. పొగాకు రైతుల సమస్యలు వివరించి, ప్రస్తుతం ఉన్న 40శాతం GSTని 28 శాతానికి తగ్గించాలని కోరనున్నారు.
Andhra Pradesh
Aqua Feed
DS BV Swamy
Atchannaidu
Gottipati Ravi Kumar
రాజీవ్ రంజన్ సింగ్
ఆక్వా రైతులు
సోయాబీన్ మీల్
పొగాకు రైతులు
జీఎస్టీ
Scroll for the next article