News30th Sep 10:23 AMSunil Byrisetty1 min read
దక్షిణ కొరియాలో మంత్రుల పర్యటన
రాష్ట్రానికి పెట్టుబడుల సాధన లక్ష్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో ఏపీ మంత్రులు నారాయణ, జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నారు. దక్షిణ కొరియాలోని ఇండియా ఎంబసీ అధికారులు, ఏపీ ఈడీబీ అధ
రాష్ట్రానికి పెట్టుబడుల సాధన లక్ష్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో ఏపీ మంత్రులు నారాయణ, జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నారు. దక్షిణ కొరియాలోని ఇండియా ఎంబసీ అధికారులు, ఏపీ ఈడీబీ అధికారులతో కలిసి కొనసాగుతోంది. అక్కడి కియా(KIA) కార్ల పరిశ్రమ హెడ్ క్వార్టర్స్ ను మంత్రులు సందర్శించారు. గ్లోబల్ మార్కెట్ లో కియా కార్ల అమ్మకాలు,కియా యూనిట్ ల విస్తరణపై చర్చించారు. ఏపీలో కియా యూనిట్ కు ప్రభుత్వం అందిస్తున్న సహకారం,ప్లాంట్ విస్తరణ వంటి అంశాలపై మాట్లాడారు. విశాఖలో నవంబర్ లో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు ఆహ్వానించారు.