Telangana10th Oct 01:58 PMSunil Byrisetty1 min read
తక్కువ ధరకే భూమి.. బోల్తా పడిన ఎమ్మెల్సీ
హైదరాబాద్ మాదాపూర్‌లో ప్రైమ్ ఏరియాలో ఐదున్నర ఎకరాల స్థలం అమ్ముతామనడంతో ఏపీ ఎమ్మెల్సీ బోల్తా పడ్డారు. తక్కువ ధరకే ఖరీదైన భూమి అంటూ ఓ వ్యక్తి బేరం పెట్టాడు. దీంతో ఏపీ ఎమ్మెల్పసీ రామచ
హైదరాబాద్ మాదాపూర్‌లో ప్రైమ్ ఏరియాలో ఐదున్నర ఎకరాల స్థలం అమ్ముతామనడంతో ఏపీ ఎమ్మెల్సీ బోల్తా పడ్డారు. తక్కువ ధరకే ఖరీదైన భూమి అంటూ ఓ వ్యక్తి బేరం పెట్టాడు. దీంతో ఏపీ ఎమ్మెల్పసీ రామచంద్రయ్య వెంటనే రూ. 25 లక్షలు అతని ఖాతాకు బదిలీ చేశారు. తర్వాత స్థలం పేపర్లు ఇస్తే లాయర్‌కు చూపించుకుంటానని రామచంద్రయ్య అడిగారు. కానీ అతను పేపర్లు ఇవ్వలేదు. ఉంటే కదా ఇవ్వడానికి అన్నట్లుగా అతను ఉడాయించాడు. దీంతో ఇప్పుడు రామచంద్రయ్య మోసం చేశారంటూ గగ్గోలు పెడుతూ పోలీసులను ఆశ్రయించారు. రాజకీయాల్లో తల పండిన రామచంద్రయ్య చవక ధర అనగానే ఆశ పడి మోసపోయారు. డబ్బులు పోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.