News29th Sep 03:35 PMSunil Byrisetty1 min read
గాడిన పడిన ఆర్థిక వ్యవస్థ.. నో ఓడీ
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతోంది. ఓవర్డ్రాఫ్ట్పై ఆధారపడే దయనీయ పరిస్థితి నుంచి సొంత కాళ్లపై నిలబడే స్వయం సమృద్ధికి ఆర్థిక శాఖ చేరుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతోంది. ఓవర్డ్రాఫ్ట్పై ఆధారపడే దయనీయ పరిస్థితి నుంచి సొంత కాళ్లపై నిలబడే స్వయం సమృద్ధికి ఆర్థిక శాఖ చేరుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ, నిధుల వినియోగంలో పాటిస్తున్న విచక్షణ రాష్ట్ర ఆర్థిక మూలాలను పటిష్టం చేశాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా ఖజానా నిర్వహణకు, ఉద్యోగుల జీతభత్యాల కోసం ఓవర్డ్రాఫ్ట్ తీసుకోవడం సర్వసాధారణంగా ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందనడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికలే ఉదాహరణ. ఆర్బీఐ విడుదల చేసిన ఫైనాన్షియల్ అకామడేషన్ అవైల్డ్ బై స్టేట్ గవర్నమెంట్స్ గణాంకాల ప్రకారం.. 2026 ప్రారంభ నెలల్లో ఏపీ ఆర్థిక క్రమశిక్షణ ఎంత వేగంగా పుంజుకుందో స్పష్టంగా తెలుస్తోంది. 2026 ఏప్రిల్ నెలలో రాష్ట్రం ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని కేవలం ఒక్క రోజు మాత్రమే వినియోగించుకోగా , ఆ తర్వాతి నెల అయిన మే-2026 నాటికి ఓవర్డ్రాఫ్ట్ రోజుల సంఖ్య జీరోకు పడిపోయింది. దేశంలో పలు ఇతర రాష్ట్రాలు ఇప్పటికీ భారీగా ఓడీ, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులపై ఆధారపడుతుండగా.. ఏపీ ఆ పరిస్థితిని అధిగమించింది.