News25th Aug 05:20 PMSunil Byrisetty1 min read
ఏపీ మున్సిపల్ శాఖ – యూకే ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం
సుస్థిర మౌలిక వసతులతో మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాల్లో దీర్ఘకాలిక సహకారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం–
సుస్థిర మౌలిక వసతులతో మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాల్లో దీర్ఘకాలిక సహకారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం–యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం (MoU) అమరావతిలో కుదిరింది. వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్,యూకే ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఫర్ బిజినెస్ అండ్ ట్రేడ్ గవర్నమెంట్ పార్ట్‌నర్‌షిప్స్ డిప్యూటీ డైరెక్టర్ చాజ్ వాలియా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యంలో అమరావతి కీలక సహకార రంగంగా నిలవనుంది. ఆధునిక, సుస్థిర, పర్యావరణహిత, మెరుగైన కనెక్టివిటీతో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణమైన రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి యూకే నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం మరింత బలం చేకూర్చనుంది. అమరావతితో పాటు రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ఈ సహకారం ఉపయోగపడనుంది.