Politics31st Oct 10:22 AMSunil Byrisetty1 min read

ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్

ఏపీలో రేపు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనుంది. ఈ రోజు పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సుల పంపిణీ చేయనున్నారు. రేపు ఉ.7 నుంచి స

ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్
ఏపీలో రేపు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనుంది. ఈ రోజు పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సుల పంపిణీ చేయనున్నారు. రేపు ఉ.7 నుంచి సా.5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు 36,351 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. 4,372 పోలింగ్ స్టేషన్ల పరిధిలో బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు 671 అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అలాగే డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర పోలీస్ నిఘా ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం నవంబర్ 2న అవసరమైన చోట రీపోలింగ్ చేపట్టనున్నారు. నవంబర్ 3న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.
Scroll for the next article