News23rd Mar 08:54 AMSunil Byrisetty1 min read
కొత్త పోలీస్ బాస్ ఎవరంటే..
రాష్ట్రంలో పోలీస్ బాస్‌గా ఎవరిని నియమించాలనే విషయంలో ప్రభుత్వం ఓ కొలిక్కి వచ్చింది. డీజీపీ ఎంపిక కోసం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు కేంద్రానికి పంపింది. సీనియర్ ఐపీఎస్ అధ
రాష్ట్రంలో పోలీస్ బాస్‌గా ఎవరిని నియమించాలనే విషయంలో ప్రభుత్వం ఓ కొలిక్కి వచ్చింది. డీజీపీ ఎంపిక కోసం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు కేంద్రానికి పంపింది. సీనియర్ ఐపీఎస్ అధికారులైన ఆ ఐదుగురిలో మాదిరెడ్డి ప్రతాప్, రాజేంద్ర నాథ్‌రెడ్డి, హరీష్ కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ ఇంఛార్జ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా కొనసాగుతున్నారు.
ఆయన డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంఛార్జ్‌ల నుంచి పూర్తిస్థాయి డీజీపీ నియామకం చేయాలని భావించడంతో యూపీఎస్సీ ద్వారా డీజీపీని ఎంపిక చేసేందుకు కేంద్రానికి పంపింది. కేంద్రం వీరిలో మూడు పేర్లు ఎంపిక చేసి తిరిగి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపనుంది. వారిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి డీజీపీగా నియమిస్తుంది. అలా నియమితులయ్యే డీజీపీ రెండేళ్లపాటు కొనసాగుతారు. మెరిట్ ప్రకారం చూస్తే హరీష్ కుమార్ గుప్తాకే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.