News19th Nov 10:01 AMSunil Byrisetty1 min read
మావోలు తప్పించుకోలేరు!
మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ పై విజయవాడలో అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా మాట్లాడారు. నేడు కూడా ఏజెన్సీలో నక్సల్, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయని, ఆరు, ఏడుగురు చనిపోయారని సమాచార
మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ పై విజయవాడలో
అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా మాట్లాడారు. నేడు కూడా ఏజెన్సీలో నక్సల్, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయని, ఆరు, ఏడుగురు చనిపోయారని సమాచారం ఉందని అన్నారు.
ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపికి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారని, నిఘా వర్గాలు వారి కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాయని వివరించారు. నవంబరు 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టామని,
మారేడుమిల్లిలో హిడ్మా, మరో ఐదుగురు ఎన్కౌంటర్ లో చనిపోయారని తెలిపారు. వాళ్ల నుంచి సేకరించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారని దృష్టి పెట్టామని,
యన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి యాభై మంది మావోయిస్టులను పట్టుకున్నామని వివరించారు.
హిడ్మాను పట్టుకున్నాక చంపామనే ప్రచారంలో నిజం లేదని లడ్డా తేల్చి చెప్పారు.