News25th Apr 12:27 PMSunil Byrisetty1 min read
స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్‌లో స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి ప్రభుత్వం పింఛన్లు అందించనుంది. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ అందించే
ఆంధ్రప్రదేశ్‌లో స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి ప్రభుత్వం పింఛన్లు అందించనుంది.
ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా ఈ కేటగిరీని ప్రవేశపెట్టింది.
అర్హురాలైన మహిళ.. భర్త మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు తన ఆధార్ కార్డు తదితర వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాలి. శుక్రవారం నుంచే ఈ వివరాలు స్వీకరించనున్నారు.
దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు త్వరితగతిన పింఛన్ అందించేందుకు ప్రయత్నం చర్యలు తీసుకుంటోంది.