News3rd Jan 04:58 PMSunil Byrisetty1 min read
ఉద్యోగుల సంక్షేమమే మా ఆశ, శ్వాస
ఉద్యోగుల సంక్షేమమే మా ఆశ, శ్వాస అని, లక్షలాది ఉద్యోగుల బలగమే తమ ఆలోచనలకు, కార్యాచరణకు శక్తిగా నిలుస్తోందని ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ అన్నారు. ఏపీ ఎన్‌జీజీవో
ఉద్యోగుల సంక్షేమమే మా ఆశ, శ్వాస అని, లక్షలాది ఉద్యోగుల బలగమే తమ ఆలోచనలకు, కార్యాచరణకు శక్తిగా నిలుస్తోందని ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ అన్నారు. ఏపీ ఎన్‌జీజీవో అసోసియేషన్ ఎన్‌టీఆర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం విజయవాడ ఏపీ ఎన్‌జీవో హోంలో జరిగాయి. ఈ సందర్భంగా ఓల్డ్ బస్టాండ్ నుంచి ఎన్‌జీవో హోంవరకు జరిగిన ర్యాలీకి భారీగా ఉద్యోగులు తరలివచ్చారు. ర్యాలీలో పాల్గొన్న ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఏపీ ఎన్‌జీజీవో ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఎన్‌జీజీవో ఎప్పుడూ ముందడుగే వేస్తుందని.. వెనకకు చూసే ప్రసక్తే లేదని.. గత ఎనిమిది నెలల కాలంలోనే ప్రభుత్వంతో చర్చల ద్వారా రూ. 13 వేల కోట్ల మేర ప్రయోజనాలు సాధించగలిగామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్ల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చైల్డ్ కేర్ లీవ్ సాధనతో పాటు డీఏ విడుదల, వైద్య సేవలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు, ఆర్‌టీసీ ఉద్యోగులకు పదోన్నతులకు సంబంధించిన సమస్యల పరిష్కారం వంటివి సాధించామన్నారు. ఇదే స్ఫూర్తితో మరో అడుగు ముందుకేసి ప్రధాన డిమాండ్లు సాధనకు కృషిచేస్తామన్నారు.