Education5th Apr 02:42 PMSunil Byrisetty1 min read

గేట్ పరీక్షలో సత్తా చాటిన నవ్య

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ పరీక్షా ఫలితాల్లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్)కి చెందిన పలువురు విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచి జా

గేట్ పరీక్షలో సత్తా చాటిన నవ్య
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ పరీక్షా ఫలితాల్లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్)కి చెందిన పలువురు విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి ర్యాంకులతో సత్తా చాటారు. బీటెక్ చదువుతున్న కాట్రగడ్డ నవ్య (బయో టెక్నాలజీ) 8వ ర్యాంకు, సిహెచ్. దినేష్ (ఈసీఈ) 23వ ర్యాంక్, డి.వర్ధన్ (ఎలక్ట్రికల్) 40వ ర్యాంక్, శ్రీధర్ వర్మ కలిదిండి (సీఎస్ఈ) 56వ రాంక్, కే.కళాతులసి (జియో ఇన్ పరమేటివ్ ఇంజనీరింగ్) 102వ ర్యాంక్, అతిధి అనన్య (ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్) 164 జాతీయ స్థాయి ర్యాంక్ లతో మెరిశారు. 100లోపు ర్యాంక్ లను నలుగురు, 500లోపు ర్యాంక్ లను 10 మంది, 500 నుంచి వెయ్యిలోపు ర్యాంకులను 12 మంది సాధించారు. వీరిలో తాడేపల్లి మండలం కొలనుకొండకు చెందిన విద్యార్థి కాట్రగడ్డ నవ్య జాతీయ స్థాయిలో 8వ ర్యాంకు సాధించడం విశేషం. వీరిని డీన్ అకడమిక్ డాక్టర్ ఎన్.జయరామ్, గేట్ ఉచిత శిక్షణ కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వినోత్ కుమార్ రాజా ప్రత్యేకంగా అభినందించారు.
Andhra Pradesh
NIT
Ranks
డీన్ అకడమిక్ డాక్టర్ ఎన్.జయరామ్
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్
Scroll for the next article