News25th Jan 10:48 AMSunil Byrisetty1 min read
న్యూఢిల్లీలో గణతంత్ర వేడుకలకు ఏపీ అధికారులు!
2026 వేడుకల్లో ఏపీఎస్‌డీఎంఏ అధికారుల ఎంపికతో జాతీయ విపత్తు సన్నద్ధత రంగంలో ఏపీఎస్‌డీఎంఏ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీ
2026 వేడుకల్లో ఏపీఎస్‌డీఎంఏ అధికారుల ఎంపికతో జాతీయ విపత్తు సన్నద్ధత రంగంలో ఏపీఎస్‌డీఎంఏ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ)లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారి,ఆపద మిత్ర వాలంటీర్లలో ఒకరు న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌ను వీక్షించడానికి ఎంపికయ్యారని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
విపత్తు ప్రమాదాల తగ్గింపు, సమాజ ఆధారిత సన్నద్ధత, విపత్తులు ఎదుర్కునే సామర్థ్యల నిర్మాణంలో, ఆపద మిత్ర కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా, ఏపీఎస్‌డీఎంఏ కెపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్ (సీబీఓ) రామాయణపు తనూజ, విశాఖపట్నం జిల్లాకు చెందిన ఆపద మిత్ర వాలంటీర్ పిట్టా స్వాతి ఈ గౌరవానికి ఎంపికయ్యారన్నారు.
దేశ ప్రథమ పౌరురాలు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక అతిథులతో నిర్వహించే సమావేశాల్లో వీరు పాల్గొనే అవకాశం ఉందన్నారు.