Education15th Jun 01:01 PMSunil Byrisetty1 min read

లక్ష మందికి పైగా విద్యార్థులకు ఉచిత JEE/NEET కోచింగ్!

ఏపీలో ఎంపీసీ, బైపీసీ చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచన చేశారు. రాష్ట్రంలోని 1355 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ,

లక్ష మందికి పైగా విద్యార్థులకు ఉచిత JEE/NEET కోచింగ్!
ఏపీలో ఎంపీసీ, బైపీసీ చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచన చేశారు. రాష్ట్రంలోని 1355 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ చదువుతున్న విద్యార్థులకు JEE, NEET వంటి జాతీయ పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఉచితంగా నాణ్యమైన ప్రిపరేషన్ మెటీరియల్ అందించడంతోపాటు కోచింగ్ అందించే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. పేద కుటుంబాల విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీ పడటానికి వీలుగా తొలిసారి ఈ ఆలోచన చేశారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణిత శాస్త్రాలకు విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే పాఠ్యాంశాలను ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల సబ్జెక్టు నిపుణుల బృందంతో ఆరు నెలలపాటు ప్రత్యేకంగా రూపొందించారు. ఈ శిక్షణ కోసం ప్రభుత్వం కళాశాలల ప్రస్తుతం ఉన్న ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమయాలను, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. ఈ కొత్త మెటీరియల్‌తో ప్రతి రోజూ రెండు గంటల పాటు కోచింగ్ అందిస్తున్నారు. అందుకోసం జూనియర్ లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణ కూడా అందించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 1,355 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని లక్ష మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు.
Andhra Pradesh
Vijayawada
nara lokesh
Jee/ Neet free coaching
one lakh students
high quality preparation
MPC and bipc students
లక్ష మందికి పైగా విద్యార్థులకు ఉచిత JEE/NEET కోచింగ్
Scroll for the next article