News5th Aug 05:24 PMSunil Byrisetty1 min read
క్లినిక్ ఏదైనా రిజిస్ట్రేషన్ తప్పనిసరి
రాష్ట్రంలో ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, సిద్ధ, యోగా-ప్రకృతి వైద్య సేవలు అందిస్తున్న ప్రైవేట్ క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు, ఆసుపత్రులు, వైద్య నిర్ధారణ కేంద్రాల
రాష్ట్రంలో ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, సిద్ధ, యోగా-ప్రకృతి వైద్య సేవలు అందిస్తున్న ప్రైవేట్ క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు, ఆసుపత్రులు, వైద్య నిర్ధారణ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన నిబంధనలు తీసుకురాబోతుంది. చిన్న క్లినిక్ నుంచి 200 పడకలకు పైబడిన ఆసుపత్రి వరకు ప్రతి ఆయుష్ ప్రైవేట్ వైద్య సంస్థ నమోదు చేసుకోవడాన్ని తప్పనిసరి చేయనుంది. అర్హత లేని వ్యక్తులు నిర్వహించే నకిలీ వైద్య కేంద్రాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు రోగులకు నాణ్యమైన, సురక్షితమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ నూతన ముసాయిదా నిబంధనలను రూపొందించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయుష్ అధికారులతో లోతుగా చర్చించారు. మంత్రి జారీచేసిన ఆదేశాల మేరకు అధికారులు ముసాయిదాపై ప్రజలు, ఆయుష్ వైద్య రంగానికి చెందిన నిపుణులు, మేధావుల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు చర్యలు చేపట్టారు. వీటిని పరిశీలించిన అనంతరమే కొత్త నిబంధనలు జారీ చేస్తామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.