News10th May 11:40 AMSunil Byrisetty1 min read
భారత్- పాక్ వార్.. తిరుపతిలో మాక్ డ్రిల్
తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో జిల్లాలో తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఆక్టోపస్, సివిల్ పోలీసులు, ఏఆర్ పోలీసులు బలగాలు, బాంబ్ డిస్ఫోస్ టీంలు, డాగ్ స్
తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో జిల్లాలో తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది.
ఆక్టోపస్, సివిల్ పోలీసులు, ఏఆర్ పోలీసులు బలగాలు, బాంబ్ డిస్ఫోస్ టీంలు, డాగ్ స్వ్కాడ్ టీంలు నాలుగు టీంలుగా విడిపోయి ఎదైన అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రజలను ఎలా రక్షించాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించారు.
130 మంది ఆక్టోపస్, పోలీసు, టీటీడీ నిఘా మరియు భద్రత విభాగం, బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి ప్రజలను ఎలా రక్షించాలనే దాని కార్యక్రమం నిర్వహించారు.
భారత్-పాక్ వార్ నేపథ్యంలో భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా ముందస్తు జాగ్రత్తగా మాక్ ఢ్రిల్ నిర్వహించి తిరుమలలో శ్రీవారి ఆలయం, కాటేజీలు, జిఎమ్ సీ టోల్ గెట్ నుండి ఆర్టీసి బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో డాగ్ స్వ్కాడ్, బాంబ్ స్వ్కాడ్ తో తనిఖీలు చేశారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. తిరుమలకు వచ్చే వాహనాలు, మఠాలు, అతిథి గృహాలు, శ్రీవారిమెట్లు, స్థానిక నివాస ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు.