News21st Jul 05:07 PMSunil Byrisetty1 min read

ఏపీ పోలీస్‌ ఇకపై ఫ్యూచర్-రెడీ

ప్రపంచవ్యాప్తంగా కొత్తకొత్త నేరాలు వెలుగుచూస్తున్నాయి. నేరాల స్వరూపం రోజురోజుకు సాంకేతికత ఆధారంగా మారుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ కూడా మారనుంది. ఆధునికంగా, వేగవంతంగా, ప

ఏపీ పోలీస్‌ ఇకపై ఫ్యూచర్-రెడీ
ప్రపంచవ్యాప్తంగా కొత్తకొత్త నేరాలు వెలుగుచూస్తున్నాయి. నేరాల స్వరూపం రోజురోజుకు సాంకేతికత ఆధారంగా మారుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ కూడా మారనుంది. ఆధునికంగా, వేగవంతంగా, ప్రజాకేంద్రీకృతంగా రూపాంతరం చెందాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడలోని డా. బిఆర్ అంబేద్కర్ కళా వేదిక లో నిర్వహించిన రిట్రీట్‌లో హోం మంత్రి అనిత రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఉన్నత పోలీసు అధికారులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. భవిష్యత్ సవాళ్లను ముందుగానే అంచనా వేసి పోలీసు వ్యవస్థను సిద్ధం చేయడమే ఈ రిట్రీట్ ప్రధాన లక్ష్యమని వివరించారు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం పెరుగుతోందని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారాన్ని వాస్తవాలు, ఆధారాలతో తిప్పికొట్టే బాధ్యత పోలీసులదేనని అన్నారు. ప్రతి ఘటనపై ప్రజలకు పారదర్శకంగా సమాచారం అందించడం ద్వారా పోలీసు వ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
Andhra Pradesh
AP Police
Vangalapudi Anita
Home Minister
Future-Ready Policing
Cyber Crime
సైబర్ నేరాలు
సోషల్ మీడియా
శాంతిభద్రతలు
ఆధునిక పోలీసింగ్
Scroll for the next article