News23rd May 12:38 PMSunil Byrisetty1 min read
రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ. ఆందోళన వద్దు
రేషన్ కార్డులకు ఈకేవైసీ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశంలో 95 శాతం ఈకేవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్
రేషన్ కార్డులకు ఈకేవైసీ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
దేశంలో 95 శాతం ఈకేవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు.
4,24,59,028 మందికి ఈకేవైసీ పూర్తి అయ్యిందని.. 22,59,498 మందికి మాత్రమే ఈకేవైసీ పూర్తికాలేదని తెలిపారు.
ఇప్పటి వరకు ఐదు లక్షల అప్లికేషన్లు మాత్రమే వచ్చాయని.. 60 వేల మంది కొత్త రైస్ కార్డులు కావాలని దరఖాస్తు చేశారని చెప్పారు.
స్ప్రిట్టింగ్ అనేది 44 వేల మంది అడుగుతూ దరఖాస్తు చేశారన్నారు.
ఛేంజ్ ఆఫ్ అడ్రెస్ కోసం 12,500 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయానికి రైస్ కార్డుల డేటాను అనుసందానం చేశామన్నారు.
రేషన్ కార్డుల జారీ నిరంతరంగా జరిగే ప్రక్రియ అని.. ప్రజలు తొందరపడవద్దని సూచించారు.
రేషన్ దరఖాస్తులకు గడువు లేదని.. అర్హత ఉన్న వారు ఎప్పుడైనా పెట్టుకోవచ్చన్నారు.