News11th Aug 12:25 PMSunil Byrisetty1 min read

సంక్షోభంలోనూ సానుకూల వృద్ధి

ఎల్ నినో సంక్షోభంలోనూ ఏపీ ఆర్ధికంగా నిలకడైన వృద్ధి నమోదు చేస్తోందని జూలై 2026 నెలవారీ ఆర్ధిక నివేదిక స్పష్టం చేస్తోంది. గడచిన రెండేళ్లుగా జాతీయ వృద్ధి రేటు కంటే ఏపీ వృద్ధిరేటు మెరు

సంక్షోభంలోనూ సానుకూల వృద్ధి
ఎల్ నినో సంక్షోభంలోనూ ఏపీ ఆర్ధికంగా నిలకడైన వృద్ధి నమోదు చేస్తోందని జూలై 2026 నెలవారీ ఆర్ధిక నివేదిక స్పష్టం చేస్తోంది. గడచిన రెండేళ్లుగా జాతీయ వృద్ధి రేటు కంటే ఏపీ వృద్ధిరేటు మెరుగ్గా నమోదు అవుతోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వాస్తవ వృద్ధి రేటు 2023-24లో 6.5 శాతం నమోదు చేస్తే 2025-26 ఆర్ధిక సంవత్సరంలో 9.9 శాతానికి పెరిగింది. రాష్ట్రంలోని వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదు అవుతున్నట్టు నెలవారీ ఆర్ధిక నివేదిక పేర్కొంది. 2025-26 రెండో త్రైమాసికంలో వ్యవసాయ రంగం 13.5 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. పారిశ్రామిక రంగం 10.6 శాతం మేర, సేవా రంగం 9.9 శాతం వృద్ధితో ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచాయి. పశుసంవర్ధక శాఖలో మాంసం ఉత్పత్తి 9.6 శాతం, గుడ్ల ఉత్పత్తి 5.1 శాతం వృద్ధిని సాధించాయి. సేవా రంగంలో ఐటి, రవాణా, వాణిజ్య కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ఎల్ నినో లాంటి సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికా విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Andhra Pradesh
AP Economy
Economic Growth
El Nino
GSDP
Economic Development
Agriculture Growth
Industrial Growth
Services Sector
IT Sector
ఆర్థిక నివేదిక
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
చంద్రబాబు నాయుడు
వృద్ధిరేటు
ఏపీ అభివృద్ధి
Scroll for the next article