News21st Aug 03:35 PMSunil Byrisetty1 min read
ఏపీ రెవెన్యూ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు
ఏపీ రెవెన్యూ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఏపీ రెవెన్యూ శాఖకు 2 స్కోచ్ అవార్డులు లభించాయి. 2025 ఏడాదికిగాను ప్రతిష్టాత్మక స్కోచ్ సమ్మిట్‌లో అవార్డుల ప్రదానం చేయనున్నారు
ఏపీ రెవెన్యూ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఏపీ రెవెన్యూ శాఖకు 2 స్కోచ్ అవార్డులు లభించాయి. 2025 ఏడాదికిగాను ప్రతిష్టాత్మక స్కోచ్ సమ్మిట్‌లో అవార్డుల ప్రదానం చేయనున్నారు. ఆన్‌లైన్ కోర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, రీసర్వే 2.0కు స్కోచ్ అవార్డులు దక్కినట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వచ్చే నెల 20న ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ప్రభుత్వ ఉత్తమ విధానాలకు అవార్డులు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.