Education31st Jul 04:55 PMSunil Byrisetty1 min read

ఎంబీబీఎస్ ప్రవేశాల్లో.. వెబ్ ఆప్షన్లకు అవకాశం

ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న అన్ని సీట్లకూ కలిపి 'ఒకేసారి వెబ్ ఆప్షన్' ఇచ్చుకునే విధానాన్ని రద్దు చే

ఎంబీబీఎస్ ప్రవేశాల్లో.. వెబ్ ఆప్షన్లకు అవకాశం
ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న అన్ని సీట్లకూ కలిపి 'ఒకేసారి వెబ్ ఆప్షన్' ఇచ్చుకునే విధానాన్ని రద్దు చేసింది. ప్రతి దశకు ముందు కొత్త ఆప్షన్లు ఇచ్చుకునేలా నిబంధనలను సవరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై అభ్యర్థులు ప్రతి కౌన్సెలింగ్ దశ ప్రారంభానికి ముందు తమకు నచ్చిన కళాశాలల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు కొత్తగా ఆప్షన్లు ఎంచుకోవచ్చు. స్లైడింగ్ విధానం ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఉంటుంది. ఒకవేళ అభ్యర్థికి కేటాయించిన కళాశాలలో సీటు పొంది చేర కపోతే.. వారు తర్వాత దశ కౌన్సెలింగ్లో అదే కళాశాలను మరోసారి ఎంచుకునేందుకు వీలుండదు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి అమల్లో ఉన్న 'ఒకేసారి వెబ్ ఆప్షన్' విధానం గత విద్యాసంవత్సరం వరకు సజావుగానే సాగింది. అయితే కౌన్సెలింగ్ ప్రారంభమైన తర్వాత కొత్త వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ అనుమతులు ఇవ్వడం, సీట్లు పెంచడం లాంటి పరిణామాల వల్ల చివరి దశల్లో కొత్త సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
Andhra Pradesh
MBBS Admissions
BDS Admissions
Medical Counselling
Web Options
NMC
వైద్య విద్య
నీట్ యూజీ
మెడికల్ కళాశాలలు
విద్యా
Scroll for the next article