Education7th Jul 02:31 PMSunil Byrisetty1 min read
బడికి రాకుంటే టీచర్ ఫాలోఅప్!
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు విద్యా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో స్కూళ్లకు సంబంధించి ముఖ్య ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీలో విద్యార్థులు మూడు రోజులకు మించి స్కూళ్లకు రాకపోతే వెం
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు విద్యా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో స్కూళ్లకు సంబంధించి ముఖ్య ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీలో విద్యార్థులు మూడు రోజులకు మించి స్కూళ్లకు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. 5 రోజుల కంటే ఎక్కువ బడికి రాకపోతే MEO, CRPలు ఆ విద్యార్థి ఇంటికి వెళ్లాలని సూచించింది. టీచర్లు, విద్యార్థుల హాజరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపింది. టీచర్లు సెలవు పెడితే వెంటనే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని అకడమిక్ పర్యవేక్షణ అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసింది.