News12th Oct 01:52 PMSunil Byrisetty1 min read
పీఆర్సీ త్వరగా పూర్తి చేయాలి
12వ వేతన సవరణ సంఘం ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా సిఫారసులు చేయాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం కోరింది. ఈ మేరకు 12వ పీఆర్సీ
12వ వేతన సవరణ సంఘం ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా సిఫారసులు చేయాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం కోరింది. ఈ మేరకు 12వ పీఆర్సీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్‌ను సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి పలు కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో 11వ పీఆర్సీ ద్వారా ప్రకటించిన ఫిట్‌మెంట్ కారణంగా ఉద్యోగులకు అంతకుముందు ప్రకటించిన మధ్యంతర భృతి (ఐఆర్) కంటే తక్కువ ప్రయోజనం లభించిందని సంఘం ప్రతినిధులు వివరించారు. దీంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని 12వ పీఆర్సీలో సమగ్రంగా పరిశీలించి, ఉద్యోగులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసారి ఫిట్‌మెంట్‌తో పాటు అలవెన్సులు, లోన్లు, అడ్వాన్సులు, ఇన్సెంటివ్‌లను కూడా సమీక్షించి, ఉద్యోగులకు గరిష్ఠ ప్రయోజనం కల్పించేలా సిఫారసులు చేయాలని విజ్ఞప్తి చేశారు.