News27th Jan 01:58 PMSunil Byrisetty1 min read
సచివాలయ సిఎస్ఓ మల్లికార్జునరావుకు ఇండియన్ పోలీస్ మెడల్
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం ముఖ్య భద్రతాధికారి(సిఎస్ఓ)గా పని చేస్తున్న పోలవరపు వెంకట శేష నాగ మల్లికార్జునరావు (అసిస్టెంట్ కమాండ్ APSPF)కు భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక మెడల్ అయిన మ
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం ముఖ్య భద్రతాధికారి(సిఎస్ఓ)గా పని చేస్తున్న పోలవరపు వెంకట శేష నాగ మల్లికార్జునరావు (అసిస్టెంట్ కమాండ్ APSPF)కు భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక మెడల్ అయిన మెరిటోరియస్ సర్వీస్ మెడల్ (ఇండియన్ పోలీస్ మెడల్)ను జనవరి 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సిఎస్ఓగా పనిచేస్తున్న మల్లికార్జునరావు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు వాస్తవ్యులు, వీరి బాల్యం, విద్యాబ్యాసం గుడివాడలో, ఉన్నత విద్యాబ్యాసం విజయవాడలో సాగింది. 1989వ సంవత్సరంలో ITBP (పారా మిలటరీ)లో కులు,హిమాచల్ ప్రదేశ్ నందు ట్రైనింగ్ చేసి అక్కడ నుంచి ITBP వివిధ యూనిట్లో అనగా ఢిల్లీ,హర్యానా, చండీగఢ్ నందు విధులు నిర్వర్తించారు. అనంతరం 1993 సెప్టెంబరులో ఐ టి బి పి నుంచి పర్మినెంట్ అబ్జర్వేషన్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం (ఎపి ఎస్పిఎఫ్)లో చేరారు.
మల్లికార్జునరావు ఎపి ఎస్పిఎఫ్ లో 1993 నుంచి వివిధ యూనిట్స్ లో అనగా డిజి ఎస్పిఎఫ్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్, ఐడిపిఎల్,ఏపీ హైకోర్టు,కేటీపీఎస్ పాల్వంచ,ఆర్టిపిపి కలముల,టిటిడి తిరుమల,ఓఎన్జిసి రాజమండ్రి,కడప,రాజమండ్రి,విజయవాడ విమానాశ్రయాల్లో, జిపిపి విజయవాడలో పని చేశారు. ప్రస్తుతం ఏపి సచివాలయంలో ముఖ్య భద్రతాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. మల్లికార్జున రావు సేవలను గుర్తించి భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక మెడల్ అయిన మెరిటోరియస్ సర్వీస్ మెడల్ (ఇండియన్ పోలీస్ మెడల్)ను జనవరి 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించింది.